Feb 07,2023 22:49

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్‌

శ్రీ మాది కార్మికుల కోసం పోరాటం
శ్రీ కార్మికులను, పోరాటాలను చులకన చేసి
మాట్లాడితే సహించేది లేదు
శ్రీ పేపర్‌ మిల్లు అఖిలపక్ష కార్మిక సంఘాల
నాయకుల హెచ్చరిక
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
'కార్మిక ద్రోహి ప్రవీణ్‌ చౌదరి.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. లేని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు' అంటూ పేపర్‌ మిల్లు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న కార్మిక సంఘాలను, ఆ సంఘాలకు మద్దతు తెలిపిన వారిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం ప్రవీణ్‌చౌదరి దిగజారుడు తనానికి నిదర్శనమని నాయకులు అన్నారు. యాజమాన్యం తొత్తులా మారి బ్రోకర్‌ పనులు చేస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ మాట్లాడారు. ప్రవీణ్‌చౌదరి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. పేపరు మిల్లులోని ఎనిమిది కార్మిక సంఘాలు ఐక్యంగా ఉన్నాయని, ఉంటాయని స్పష్టం చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులు అర్ధరాత్రి తన్నుకున్నారని, నిరసన దీక్షల ముసుగులో బిర్యానీలు తింటున్నారంటూ ప్రవీణ్‌చౌదరి చేసిన ఆరోపణలు అర్ధరహితం అన్నారు. గేటు ఎదురుగా ఉన్న సిసి పుటేజిని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రవీణ్‌ చౌదరి, అతని అనుచరులే బ్యానర్లను చించారని తెలిపారు. ప్రవీణ్‌ చౌదరికి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. పరంపర పేరుతో ఒకొక్క పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.11.50 లక్షలకు అమ్ముకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మిల్లులో పనిచేసిన పర్మనెంటు కా ర్శికుడు జానకిరామ్‌ నుంచి ప్రవీణ్‌చౌదరి ఏ అర్హతతో రాజీనామా లెటర్లు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై మిల్లు హ్‌ెచ్‌ఆర్‌ ఐఆర్‌ అక్కినేని జయకష్ణ స్పందించాలని డిమాండ్‌ చేశారు. జయకృష్ణ, ప్రవీణ్‌ చౌదరి అడ్డగోలుగా పోస్టులు అమ్ముకోవడమే కాకుండా ప్రశ్నించిన కార్మిక సంఘాలపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. పోస్టుల నియామకం పాదర్శకంగా చేసి ఉంటే లిస్టు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. పేపరు మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా అడ్డుకుని మూడేళ్లుగా ప్రవీణ్‌చౌదరి కార్మికుల పొట్టగొట్టారన్నారు. కడియం పేపరు మిల్లుల జరిగిన సుదీర్ఘ పోరాటానికి ప్రవీణ్‌ చౌదరే వెన్నుపోటు పొడిచారని తెలిపారు. గత వేతనం ఒప్పందం రూ.5500కు జరిగినప్పటికీ కేవలం రూ.2,100కే ఈ సారి పరిమితం చేశారని తెలిపారు. కోవిడ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించావని ప్రవీణ్‌ను ప్రశ్నించారు.
ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ ప్రవీణ్‌ చౌదరి చేస్తున్న అక్రమాల ఫలితంగా తండ్రి స్టాలిన్‌ చౌదరి, తాత చిట్టూరు ప్రభాకర్‌చౌదరి పరువు పోతుందన్నారు. వారిరువురూ కార్మికోద్యమంలో కీలకంగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం పనిచేశారన్నారు. అటువంటి వారి తనయుడు యాజమాన్యం తొత్తులా వ్యవహరించడం తగదన్నారు. కార్మిక నేతగా ప్రవీణ్‌ చౌదరి చేసింది ఏమిటో చెప్పాలన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్‌ విసిరారు. ఐఎన్‌టియుసి నేత దాస్‌ మాట్లాడుతూ మిల్లులో కార్మిక సంఘాలు యాజమాన్యంతో ప్రతి మూడేళ్లకోసారి అగ్రిమెంట్‌ చేసుకుని 150 నుంచి 200 వరకూ పోస్టులు భర్తీ అయ్యేవన్నారు. ఆరేళ్లుగా ప్రవీణ్‌ చౌదరి కారణ ంగానే అగ్రిమెంట్‌ నిలిచిపోయిందని తెలిపారు. కేవలం 374 మందికి ఉపాధి కల్పించి తన ఘనతగా చెప్పు ఎకోవటం అర్ధరహితం అని అన్నారు. అగ్రిమెంట్లు క్రమం తప్పకుండా జరిగి ఉంటే సుమారు 400 మందికి పోస్టులు వచ్చేవన్నారు. వేతన ఒప్పందంతో కార్మికులు మంచి వేతనాలు పొందేవారని వివరించారు. స్టాఫ్‌ అండ్‌ వర్క్‌ మెన్‌ వెల్ఫేర్‌ అసోవియేషన్‌ అధ్యక్షులు కె.రాజేష్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రవీణ్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. అనంతరం సిఐటియు నాయకులు వెంకటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు రామారావు, దుర్గ యునైటెడ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కాకి రమణ, శ్రీనివాస్‌, టిఎన్‌టియుసి నాయకులు రమణ, బోస్‌, చైతన్య కార్మిక సంఘం నాయకులు ప్రసాద్‌, యాదవ్‌ మాట్లాడారు.