నివాళులర్పిస్తున్న బేబిరాణి తదితరలు
- సిఐటియు జాతీయ ఉపాధ్యక్షుాలు బేబిరాణి
- ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
- మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి పిలుపునిచ్చారు. కార్మిక నేత పర్స సత్యనారాయణ జయంతిని శ్యామలా సెంటర్‌లోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సత్యనారాయణ చిత్రపటానికి బేబిరాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. 1970లో సిఐటియు ఏర్పడిందన్నారు. సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ వ్యస్థాపక అధ్యక్షులుగా ఎన్నికయ్యారన్నారు. ఎన్నో కార్మిక సంఘాలను స్థాపించి కార్మికుల హక్కులు, వేతనాలు, సౌకర్యల కోసం పోరాడారన్నారు. గనీ కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటం ఎనలేనిదన్నారు. కార్మికలోకం పత్రిక ద్వారా ఎన్నో వ్యాసాలు రాసి కార్మికులను చైతన్యవంతం చేశారన్నారు. అయన పోరాట స్ఫూర్తితో నేడు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికవర్గం ఐక్యంగా ఎదుర్కొనాలన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు కార్మికలను బానిసలుగా చేసి వారి రక్త మాంసాలు పీల్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మోదీకి బి టీమ్‌గా మారిందన్నారు. కార్మికులు, ఉద్యగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటికూడా నెరవేర్చలేదన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోదీ, జగన్ ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి, రాజమండ్రి ప్రాజెక్టు కార్యదర్శి సునీత, సిపిఎం రాజమండ్రి నగర కార్యదర్శి బి.పవన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా తదితరులు పాల్గొన్నారు.










