ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జిల్లా కమిటీల ఎన్నిక ఆదివారం జరిగింది. యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్ల సమావేశం స్థానిక యుటిఎఫ్ హోం లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షలు బిఎస్‌ఆర్.శర్మ, ప్రధాన కార్యదర్శి బిజె గాంధి, వర్కింగ్ ప్రసిడెంట్ జిఎం.దయాకర్, ఉపాధ్యక్షులు లక్ష్మీశ్రీనివాస్, విజయభేరి నరసింహం, ఎస్.మూర్తి పాల్గొన్నారు. అనంతరం నూతన జిల్లాల కమిటీలను ఎన్నుకున్నారు. తూర్పుగోదావర జిల్లా అధ్యక్షులుగా వి.లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌వివి.సత్యనారాయణ, కోశాధికారిగా పి.శ్యామలరావు, వర్కింగ్ ప్రసిడెంట్‌గా జ.గంగాధరం, ఉపాధ్యక్షులుగా కెవి.కృష్ణ, కె.మరళి, బి.సింహాచలం, ఎన్.విజరుకుమార్, జె.సదాకరణ్, జాయింట్ కార్యదర్శులుగా జాన్ పీటర్, కె.రమేష్‌బాబు, వై.రత్నం రాజు, మహిళా కార్యదర్శులుగా దైవకృప, కె.విజయదుర్గ, రాష్ట్ర కౌన్సిల్ జిల్లా సభ్యులుగా సిహెచ్.విఘ్నేష్ ఎన్నికయ్యారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా డివిఆర్.కుమార్‌రాజు, జనరల్ సెక్రటరీగా జివివి.సత్యనారాయణ, కోశాధికారిగా కె.గోవింద్, ఉపాధ్యక్షులుగా కె.వెంకటరెడ్డి, ఎ.రామసత్యనారాయణ, కె.శివన్నారరణ, ఎంవివి.సత్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీగా వి.చిరంజీవి, ఎ.నాగరాజు,మహిళా కార్యదర్శిగా ఎ.మంగతాయారు, కె.అరుణ ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా డి.మోహన్. అధ్యక్షులుగా పి.రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డి.ప్రవీణ్‌కుమార్, జనరల్ కార్యదర్శిగా వి.అచ్చుతంబాబు, కోశాధికారిగా ఎస్.దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులుగా కె.చిన్నబ్బాయి, కె.శోభన్, జాయింట్ సెక్రటరీగా పి.రామాంజనేయులు, మహిళా కార్యదర్శులుగా జయ శీలక్రిష్టిలను ఎన్నుకున్నారు.ఈ సమావేశంల వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.










