ప్రజాశక్తి-యంత్రాంగం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాయి. కొవ్వూరు రూరల్‌లో కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి అరిగెల అరుణ కుమారి ఎన్నికల్లో విజయంపై హర్షం వ్యక్తం చేశారు. నిడదవోలులో పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి సుబ్బారావు, కారింకి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. స్థానాపతి ఉషారాణి, చిన్నం మురళీకృష్ణ, అగర్వాల్ హీరాలాల్, జివివి.సత్యనారాయణ, కొణిజేటి వెంకటనారాయణ, జిల్లా కార్యదర్శి పెచ్చెట్టి కోటేశ్వరరావు, హుస్సేన్ షేక్ ఖాసిం, మహమ్మద్ అన్వర్ ఖాన్, పుచ్చకాయల ప్రసాద్, భావన రమేష్, గుర్రం రమేష్ పాల్గొన్నారు. రాజానగరంలో పార్టీ రాజ మహేంద్రవరం పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ వైఎ. వడయార్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముప్పిడి శ్రీను, డాక్టర్ వై.శ్రీనివాసరావు, రాజేష్, దాసరి లోవరాజు, బొత్స యేసు పాల్గొన్నారు. సీతానగరం కూనవరంలో అయిల శేషగిరి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రంగాశ్రీను, దూలం అరుణ్ తేజ, శీలం రామకృష్ణ, పిర్ల సురేష్, మట్టా రాము, ఊడి వెంకట రత్నం పాల్గొన్నారు. చాగల్లులో కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి అరిగెల అరుణ కుమారి హర్షం వ్యక్తం చేశారు. చాగల్లు మెయిన్ బజార్లో భారీ ఎత్తున బాలసంచి కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రభాకర్ చౌదరి, బి.రాంబాబు పాల్గొన్నారు.










