Mar 24,2023 22:52

ప్రజాశక్తి-రాజానగరం బిజెపి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు కాంగ్రెస్‌ పార్టీ భయపడదని ఎపి కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ అన్నారు. రాజానగరంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పద్మశ్రీ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల సొమ్మును కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని చెప్పారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాహుల్‌ గాంధీ ఎప్పుడూ కేసులకు భయపడే వ్యక్తి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్‌ లూధర్‌, డాక్టర్‌ వడియార్‌ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఎ.శేషగిరిరావు, ముప్పుడి శ్రీను పాల్గొన్నారు.