Oct 16,2023 23:11

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం
కాంచీపురం నారాయణి శిల్స్‌ షోరూమ్‌ను రాజమహేంద్రవరంలో సోమవారం ప్రారంభించారు. కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి షోరూమ్‌ను ప్రారంభిం చారు. సినీనటి శ్రీలీల ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సంప్రదాయం, ఆధునికత కల బోసిన కాంచీపురం నారాయణి శిల్క్స్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. షోరూమ్‌ డైరెక్టర్‌ అభినరు మాట్లాడుతూ ప్రతి రూ.15 వేలు కొనుగోలుపై 20 గ్రాముల వెండి నాణెం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రారం భోత్సవ ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పురుషులకు వినూత్న బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్‌ సురేష్‌, టి కేశవ గుప్తా, టి.రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీలను చూసేందుకు షోరమ్‌ వద్దకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.