Sep 29,2023 14:21

ప్రజాశక్తి-గోకవరం(తూగో) : మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ అధ్యక్షులు సత్యం సుబోస్ చంద్ర బోస్(70) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ బోసు పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుమారులు శ్యామ్, వెంకటరాజులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబోస్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన మల్లవరం సర్పంచ్ గా, సొసైటీ అధ్యక్షులుగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని, ప్రస్తుతం రాష్ట్ర టిడిపి కార్యదర్శిగా టిడిపి సేవలు అందిస్తున్న ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు రేఖ బుల్లిరాజు, విడుదుల అర్జున్ రావు, మరిసే అప్పారావు తదిత టిడిపి నాయకులు పాల్గొన్నారు.