Jun 04,2023 15:20

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాజమండ్రి రూరల్, బొమ్మూరు గ్రామం నుండి మాచెట్టీ శివ అధ్వర్యంలో రూరల్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన.నాగేశ్వర్ సమక్షంలో టీడీపీ, జనసేన నుండీ వైఎస్ఆర్సీపీ లో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన.నాగేశ్వర్  చేస్తున్న అభివృద్ది, ఉచిత అన్నదానం, పేదలకు కష్టంలో ఉన్నవాళ్ళకి ఆర్థిక సహాయం చెయ్యడం వీటికి ఆకర్షితులయ్యి, జగనన్న ప్రజలకోసం చేస్తున్న సంక్షేమానికి, అభివృద్ది చూసి మేము ఈ రోజు చందన సమక్షంలో వైఎస్సార్సీపీ లో చేరడం జరిగింది అని ప్రసాద్ తెలిపారు. చందన మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి యువత వెన్నెముక అని, వాళ్ళ నిర్ణయాలతో ప్రభుత్వాలు ఏర్పడే పరిస్తితి ఈరోజున దేశం మొత్తంలో వుందని, అలాగే మన జగనన్న యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, సచివాలయం మరియు వాలంటీర్లు ఇవి అన్నీ యువత కోసమే రూపొందించడం జరిగింది అని చందన తెలిపారు.