కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా జవాబుదారీతనంలో కూడిన పౌర సేవలు అందిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు. బుధవారం విఎల్.పురం 11వ వార్డు పరిధిలో 24, 25 , 26 సచివాలయాలకు చెందిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జెసి ఎన్.తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్ ప్గాొని ధ్రువపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత ఉన్నా పథకాలు అందకపోతే వారిని గుర్తించి అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సిఎం ప్రవేశపెట్టారన్నారు. 99 శాతం మంది ప్రభుత్వ పథకాలను అందుకుంటున్నారు. ఇంకా మిగిలిన ఉన్న ఒక్క శాతం అర్హత కలవారిని గుర్తించి పథకాలు అందిస్తామన్నారు. కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, కారు ఉందని, భూమి ఉందని తొలగించిన వారి విషయంలో అర్హత ఉంటే వాటిని సరిచేసి తిరిగి పథకాలు వర్తింపజేస్తామన్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దష్ట్యా అవసరమైన కుల, ఆదాయ తదితర ధ్రువ పత్రాలను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్, కాపు నేస్తం, జగనన్న చేదోడు, జగనన్న తోడు తదితర సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పొందకుండా ఉన్న వారికి అర్హత మేరకు ద్వై వార్షిక మంజూరు ద్వారా వర్తింపజేస్తామన్నారు. కుల ధవీకరణ పత్రాలు 394, ఆదాయ ధవీకరణ పత్రాలు 377 ఇతర సేవలు 30 మేర అందించినట్లు కలెక్టర్ తెలిపారు. జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ. పట్టణ ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ద్వారా నేరుగా పౌర సేవలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్ మాట్లాడుతూ, వాలంటీర్లను ఇంటింటికీ పంపి ఎవరెవరికి ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి, ఏ పథకాలు అమలు కావాలో తెలుసుకున్నామన్నారు. 24, 25, 26 సచివాలయాల్లో 1,832 ఇళ్లను సందర్శించి టోకెన్లు జారీ చేశామన్నారు.










