జూనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జూనియర్ ఇంటర్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 1,02,643 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారు. గంట ముందుగానే విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందు కోసం ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను నడిపింది. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులను సమకూర్చింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను పోలీసులు మూయించేశారు.










