May 29,2023 16:47

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ప్రతి ఇంటికి ఉచితంగా పైపులైన్ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా జలజీవన్ మిషన్ తో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. సోమవారం మండల కేంద్రం ఉండ్రాజవరంలో వివిధ కార్యక్రమాలకు విచ్చేసిన ఆయన ట్యాంకు నిర్మాణ స్థలం వద్ద శిలాఫలకాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆర్.కె. నగర్ కాలనీలో 5 కోట్ల, 82 లక్షల అంచనా వ్యయం, రెండు లక్షల లీటర్ల కెపాసిటీ తో మంచినీటి టాంక్ నిర్మాణం జరుగుతుందని, తొందరలోనే నిర్మాణం పూర్తి చేసి, తాగునీరు ప్రజలకు అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపారు. అనంతరం ఉండ్రాజవరం గ్రామ  సచివాలయం 1, వెల్నెస్ సెంటర్1,   సచివాలయం3, భవనాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి శరత్, జెడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, రాష్ట్ర కుర్ని కరికాల భక్త బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కరెళ్ళ సూర్య వెంకట మంగాదేవి, కఠారి సిద్ధార్థ రాజు, సర్పంచ్ మెండే వెంకటరావు, సుధాకర్,  ఎంపీడీవో ఏ శ్రీనివాస్,  తహసిల్దార్ జి కనకరాజు, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ,  టి శ్రీనివాస్ బాబు,  ఏ ఈ, ఆర్ హెచ్ ఎస్ డి భవాని,  సర్పంచ్ లు, ఎంపీటీసీలు,  వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.