ప్రజాశక్తి - సీతానగరం పురుషోత్తపట్నంలో శనివారం ఆర్‌డబ్ల్యుఎస్ చీఫ్ ఇంజనీర్ టి.గాయత్రీ దేవి పర్యటించారు. రాజానగరం నియోజకవర్గంలో ఇంటింటికి గోదావరి జలాలు అందించడానికి మంజూరైన రూ.215 కోట్లతో చేపట్టిన పనులకు భవిష్యత్ అవసరాల దష్ట్యా ఇన్‌టేక్ వెల్ నిర్మాణం, హెడ్ వర్క్స్ నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతాలను గాయత్రీదేవి పరిశీలించారు. పరిశీలనలో భాగంగా పోలవరం ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు అందించడానికి జల్ జీవన్ మిషన్‌లో పనులు త్వరలోనే పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యకమంలో యం.శ్రీనివాస్, డి.బాలశంకర్రావు, రవి కుమార్, అవినాష్, సుబ్బారావు, సతీష్ పాల్గొన్నారు.










