Sep 27,2023 22:43

కోరుకొండ హైస్కూల్లో జిపిఎస్‌ బిల్లు ప్రతులను దగ్ధం చేస్తున్న టీచర్లు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిపిఎస్‌ను వ్యతి రేకిస్తూ జిపిఎస్‌ బిల్లు ప్రతులను కోరుకొండలోని స్కూల్‌ సెంటర్‌ వద్ద యుటిఎఫ్‌ నాయకులు బుధ వారం దహనం చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్‌ మాట్లా డారు. జిపిఎస్‌ వద్దని, పాత పింఛను విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా జిపిఎస్‌ బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం దారుణమన్నారు. ఇది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చీకటి రోజు అని అన్నారు. వెంటనే ఈ జిపిఎస్‌ బిల్లును రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయకర్‌ మాట్లాడతూ రాష్ట్రంలో 3 లక్షల పైబడి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసిందన్నారు. జిపిఎస్‌ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యుటిఎఫ్‌ నాయకులు రాజేష్‌కుమార్‌, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.