Jul 12,2023 22:10

అతిథులను సత్కరిస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి - రాజానగరం
నేటి ప్రపంచంలో వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటులు సంభవిస్తున్నాయని, జీవనశైలి మార్పుతోనే గుండె సమస్యల నుంచి రక్షణ పొందగలమని క్లినికల్‌ న్యూరోఅనాటమీ ప్రొఫెసర్‌, మలేషియాకు చెందిన ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ లింకన్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కెబి.స్వామి అన్నారు. ఆదికవి నన్నయ యూననివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిపార్టమెంట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి కె.పద్మరాజు, ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ స్వామి, ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి.విజయనిర్మల హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ లైఫ్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో ''లైఫ్‌ స్టయిల్‌ మోడిఫికేషన్‌ సేవిస్‌ ఫ్రమ్‌ సడన్‌ కార్డియాక్‌ డెత్స్‌'పై అంతర్జాతీయ అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించడం హర్షనీయమన్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారని, వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా సంబవించే గుండె సమస్యల పట్ల అందరూ అవగాహాన పెంచుకోవాలన్నారు. ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ స్వామి కె.బి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువైందన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతారణ పరిస్థితులు, శారీర మానసిక ఆరోగ్య పరిస్థితులు వంటివి గుండె సమస్యలకు ఎలా కారణం అవుతున్నాయనే విషయాలని పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. గుండె సంబంధిత వివిధ సమస్యలను ముందుగా గుర్తించడం, వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. మధ్యపానం, ధూమపానం, ఒత్తిళ్లకు లోనుకావడం, అధిక వ్యాయామం వంటివి ప్రమాదాలకు కారణమన్నారు. ఆకస్మికంగా గుండెపోటు వస్తే చేయాల్సిన ప్రథమ చికిత్స, గోల్డెన్‌ అవర్‌ గురించి వివరించారు. గ్యాస్ట్రిక్‌ సమస్యలు, గుండె సమస్యలు మధ్య వ్యత్యాసాన్ని తెలిపారు. రెగ్యులర్‌గా జనరల్‌ చెకప్‌లను చేయించుకోవాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేసారు. ఈ కార్యక్రమంలో జూవాలజీ విభాగాధిపతి కన్వీనర్‌ డాక్టర్‌ పి.విజయనిర్మల, అధ్యాపకులు డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, డాక్టర్‌ డి.కళ్యాణి, జ్యోతి, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు.