Apr 09,2023 16:18

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని రంపఎర్రంపాలెం గ్రామంలో ఆదివారం గోకవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పాటి రాంబాబు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు గృహసారధులు గ్రామ వలేంటీర్లుతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం 3వ రోజుకి చేరింది ఈ సందర్భంగా కన్వీనర్ పాటి రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యత్యాసాలును చదివి వినిపించడం జరుగుతుందని ప్రజా మద్దతు పుస్తకంలో ఉన్న ప్రశ్నలను నింపి లబ్ధిదారునికి స్లిప్ ఇచ్చి లబ్ధిదారుని అనుమతితో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉన్న డోర్ స్టిక్కర్ను అంటించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు మద్దతు తెలిపేందుకు ఒక ఫోన్ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని లబ్ధిదారుని కోరడం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం పట్ల ప్రజల్లో విశేష స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వలేంటీర్లు పాల్గొన్నారు.