Apr 08,2023 15:03
  •  కార్యక్రమంలోపాల్గొన్న ఎమ్మెల్యే చంటిబాబు

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చంటిబాబుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ గడప గడపకు జగనన్న చేస్తున్న సంక్షేమం వల్ల  జనం వాళ్ళ గుండెల్లో జగన్ ని పెట్టుకుని కొలిచేలా పాలన చేస్తున్నారు అన్నారు అలాంటి పాలనను చూసిన రాష్ట్ర ప్రజలంతా ఒకే నినాదం మా నమ్మకం నువ్వే జగన్ అని అంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో  గోకవరం మండల వైసీపీ నాయకులు సచివాలయ కన్వీనర్లు గృహసారథులు కార్యకర్తలు పాల్గొన్నారు.