Jul 07,2023 16:19

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని రంపఎర్రంపాలెం పెంటపల్లి  గ్రామాలలో ఉప సర్పంచ్ ధాకరపు ధర్మరాజు ఆధ్వర్యంలో గోకవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పాటి రాంబాబు అధ్యక్షతన  శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పాల్గొని మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఇంకా ఎవరైనా అర్హులకు ఏదైనా సంక్షేమ పథకం అందకపోతే తక్షణం వారికి అందించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం  ద్వారా లబ్ధిదారులకు 11 రకాల సేవలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు రంప ఎర్రంపాలెం సచివాలయం 1లో 1440 సర్టిఫికెట్లు పెంటపల్లి సచివాలయం 2 సంబంధించి 567 సర్టిఫికెట్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చంటిబాబు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పలు శాఖ అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.