ప్రజాశక్తి-చాగల్లు : చాగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి ఆరోగ్య పరీక్షలు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా చాగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు మెగా క్యాంపు లను నిర్వహించడం జరుగుతుంది అని డాక్టర్ కే లక్ష్మీ ప్రియా అన్నారు ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 30 తేదీన చాగల్లు-2 సచివాలయం పరిధిలో ను,అక్టోబర్ 10వ తేదీన చాగల్లు - 3 సచివాలయం పరిధిలో ను అక్టోబర్ 13వ తేదీన నెలటూరు సచివాలయం పరిధిలోను, అక్టోబర్ 18వ తేదీన చాగల్లు 4 సచివాలయం పరిధిలో ను, అక్టోబరు 19వ తేదీన చాగల్లు 5 సచివాలయం పరిధిలో ను క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఈ క్యాంపులు జరగడానికి 20 రోజులు ముందు నుంచి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆరోగ్య సిబ్బంది పలు వివరాలను అడిగి సమాచారాన్ని ట్యాబ్ లలో పొందుపరుస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తప్పనిసరిగా మూడు రకాల పరీక్షలు నిర్వహించాలి. షుగరు బిపి ఆర్ బి ఎస్ పరీక్షలు అవసరమైన వారికి చేస్తారు.ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. టోకెన్ తీసుకుని జగనన్న ఆరోగ్య సురక్ష మెగా క్యాంపు కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలి కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం చాగల్లు గ్రామ సచివాలయం-2 సచివాలయం మరియు చాగల్లు-3 సచివాలయం పరిధిలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలోనే సీజనల్ వ్యాధులకు సంబంధించి జ్వర పీడితులను గుర్తించి వారిని తగు పరీక్షలు నిమిత్తం చాగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయడం జరుగుతుంది అని ఆమె అన్నారు ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జేజి సుధీర్, హెల్త్ అసిస్టెంట్లు కే నాగేశ్వరరావు, ఆదిలక్ష్మి , సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










