Sep 22,2023 16:18

ప్రజాశక్తి-చాగల్లు : మండలంలోని బ్రాహ్మణగూడెం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న నందిగంపాడు, దారవరం గ్రామాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సర్వే ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబంలో ఆరోగ్య సర్వేను అనగా పుట్టిన బిడ్డల నుండి 60 సంవత్సరములు పైబడిన వయసు వరకు అందరిని ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని యాప్ ద్వారా సమాచారం సేకరించారు. 30 సంవత్సరాల పైబడిన వయసు వారికి బీపీ, షుగర్, రక్త శాతం, మలేరియా, డెంగ్యూ పరీక్షలను ఇంటి వద్దనే చేసి వివరాలు సేకరించారు. అనంతరం సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు జరిగే ఆరోగ్య క్యాంపుల నందు వారికి స్పెషలిస్ట్ డాక్టర్లచే గుండె సంబంధిత, థైరాయిడ్, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతోపాటు ఇతర చికిత్సలు అందిస్తామని బ్రాహ్మణ గూడెం పీహెచ్సీ వైద్యాధికారిణి కె.నిశిత తెలిపారు. ఆయుష్మాన్ భవన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల విలువచేసే ఆరోగ్య కార్డును అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందుకు పాడు గ్రామ సర్పంచ్ కుదప  రాంబాబు దారవరం సర్పంచ్ ఎం రవికుమార్  డాక్టర్ పి ఆర్ ఎల్ దేవి, ఎం పి హెచ్ ఈ డి సి హెచ్ శ్రీనివాస్, పి హెచ్ ఎన్ లు వి. పద్మ, ఎం. రామచంద్రరావు, ఎం. రాజశేఖర్, డి.వి రామకృష్ణ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.