ప్రజాశక్తి-గోకవరం : పేదలకు ఆరోగ్య రక్షణ అందించడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారని జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని కామరాజుపేట గ్రామంలో నిర్వహించిన జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలు అర్పించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహార స్టాల్స్ ను అలాగే వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన శిబిరాలను సందర్శించారు. ఈసందర్భంగా గర్భిణీలకు పౌష్టికాహార్ కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ప్రాంగణంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా రోగులకు మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 550 మంది రోగులకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజల సద్విని చేసుకోవాలన్నారు. అనంతరం 20లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే సుమారు 20 లక్షల రూపాయలతో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, వైసీపీ నాయకులు సింబోతుల శ్రీనివాస్, దాసరి రమేష్, సుంకర వీరబాబు, పాటి రాంబాబు, మడికి మైనర్ బాబు, గోకాడ చిట్టిబాబు, గాజింగం సత్తిబాబు, కరి సూరారెడ్డి, దాసర సతీష్, రామకృష్ణ, నాగేశ్వరరావు, ఎంపిడిఓకే పద్మజ్యోతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రమ్మ, అంగన్వాడి, ఆశ, ఆరోగ్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










