ప్రజాశక్తి-గోకవరం : జగనన్న ఆణిముత్యాలతో విద్యార్థులకు పోటీతత్వం పెంపొందుతుందని గోకవరం ఎంపీపీ సుంకల శ్రీవల్లి వీరబాబు అన్నారు సోమవారం మండలంలోని రంప ఎర్రంపాలెం కామరాజుపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్న పాఠశాలలో వీరలంకపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోను నిర్వహించిన ఆణిముత్యాలు నగదు పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా పదవ తరగతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదుతో పాటు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సాహాకాలును అందిస్తే చదువు పట్ల పోటీ తత్వం పెంపొందుతుంది అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలను అనుగుణంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు అలాగే మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పాటి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవితకు విద్యాశాఖలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమూల మార్పులు తీసుకొచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ పాటి రాంబాబు పిఎం సి చైర్మన్ ఎస్ ఎస్ గుప్తా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పి సత్యానందం హెచ్ఎంలు జి ప్రమీలరాణి ఈశ్వర దేవి ప్రిన్సిపాల్ సర్పంచ్ ఆడపా వెంకటరావు కాటమస్వామి లోవ కుమార్ సింబోతుల శ్రీనివాస్ రాజశేఖర్ ఎం రామకృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు










