Jun 17,2023 15:15

ప్రజాశక్తి - సీతానగరం : శనివారం స్థానిక సీతానగరం పువ్వాడ సత్యమాంభ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హఎచ్ఎం పుష్పాలత ఆధ్వర్యంలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతానగరం సర్పంచ్ కొండ్రపు ముత్యాలు హాజరయ్యారు. పాఠశాల స్థాయి లో 2023 సంవత్సరం పదవ తరగతిలో మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థుల తల్లులను సర్పంచ్ ముత్యాలు సన్మానించారు. ముత్యాలు మాట్లాడుతూ ప్రభుత్వ చదువుతున్న విద్యార్తులను ప్రోత్సాహించడం మంచి పరిణామం అన్నారు. ఎంపీటీసీ మట్ట శ్రీను, ఎస్ఎంసీ చైర్మన్ బండారు సూర్య కుమారి విద్యార్థులను సన్మానించారు. మొదటి బహుమతి విద్యార్థిని యశ్విని సంధ్యా దేవి, రెండవ బహుమతి హారిక, మూడవ బహుమతి నాగదేవిలకు ధృవపత్రాలు, మెమెంటోలు, నగదు  పారితోషికం అందించారు. పాఠశాల తరపున హెచ్ఎం పుష్పాలత శాలువాలు, పూలదండలతో చిరు సత్కారం చేశారు.  ఉపాధ్యాయులు కన్నూరి సతీష్ బాబు మాట్లాడుతూ మిగతా విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేష్, సరళ, రాజేశ్వరి, విశాలాక్షి, శంకర్ రావు, బ్రహ్మాజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.