Jun 01,2023 23:20

ర్యాలీలో పాల్గొన్న ఎంపీ భరత్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాష్ట్రంలో జగనన్నతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. జగన్‌ సిఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు అయిన సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. స్థానిక ఎంపీ కార్యాలయం నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జగన్‌ హయాంలో ప్రజలందరికీ సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. పేదల పాలిట పెన్నిధిగా, పెద్ద దిక్కుగా జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందించారన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సమర్థవంతమైన పాలన అందించి 'జయహౌ జగనన్నా' అని ప్రతీ ఒక్కరి నుంచీ అనిపించుకున్న ఏకైక సిఎం జగన్‌ అన్నారు. టిడిపి రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహించి తన డొల్లతనాన్ని బయట పెట్టుకుందనానరు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడమే కాకుండా ఇప్పుడు మల్లీ ఎన్‌టిఆర్‌ విగ్రహాలకు దండలు, శతజయంతులు నిర్వహించి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారన్నారు. ప్రజామన్ననలు పొందుతున్న వైసిపి ప్రభంజనం ముందు టిడిపి వెలవెలబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గుర్రం గౌతమ్‌, మార్గాని సురేష్‌, నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ, బీసీ సెల్‌ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కాటం రజనీకాంత్‌, బర్రే కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.