May 09,2023 23:53

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ మాధవీలత తదితరులు

కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారం చేసే విధానంలో అధికారులపై మరింత బాధ్యత పెరిగిందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరం నుంచి 'జగనన్న కే చెబుదాం' ఆన్‌లైన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని సిఎం విడిది కార్యాలయం నుంచి జగనన్న కే చెబుదాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ మాధవీలత మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పుడు జెకెసి కార్యక్రమంతో మరింత బాధ్యతతో పాటుగా జవాబుదారీ తనం కూడా పెరిగిందన్నారు. జిల్లా స్థాయిలో కాకుండాగ్రామ స్థాయి వరకు ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడం ముఖ్యమన్నారు. ఈ మేరకు జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో మానిటరింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి, జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, రూడా చైర్మన్‌ మేడపాటి షర్మిలరెడ్డి, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, డిఆర్‌ఒ జె.నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.