Jun 25,2023 23:18

ప్రజాశక్తి-కడియం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని రాజ మహేంద్రవరం ఆర్‌డిఒ చైత్ర వర్షిణి ఆదేశించారు. ఆదివారం కడియం మం డలం మురమండలో ఈ కార్యక్రమం పనితీరును పరిశీలించారు. గ్రామ వాలంటీర్లు చేసే సర్వేను, వాటిని ఆన్‌లైన్‌ చేస్తున్న విధానాన్ని మండల ఎఒ కె.చంద్రరావు ఆర్‌డిఒకు వివరించారు. ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా ఈ కార్యక్రమం ద్వారా న్యాయం చేయాలన్నారు. ఈ కార్య క్రమ ంపై ఎలాంటి అశ్రద్ధ వహించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. దర ఖాస్తు లు ఆన్‌ లైన్‌ జరిగిన తీరును డిఎ కాశీ విశ్వనాథ్‌ను ఆర్‌డిఒ అడిగి తెలు సుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు
దేవరపల్లి మండంలోని గౌరీపట్నం గ్రామంలో ఆదివారం గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ తలారి మాట్లాడుతూ సిఎం జగన్‌ నాలుగు సంవత్సరాల పరిపాలన కాలంలో దాదాపు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాలు అమలు చేశారన్నారు. ఆయన ఏర్పాటు చేసిన సచివాలయం వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటిలో అవసరమైన వ్యక్తిగత ధ్రువపత్రాలు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారేమోనని అటువంటి వారి కోసం జగనన్న సురక్ష పథకం ప్రవేశపెట్టారన్నారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న సురక్ష పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కెవికె.దుర్గారావు, ప్రజా ప్రతినిధులు, సచివాలయం సిబ్బంది, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాపవరంలో సర్వే..
కొవ్వూరు రూరల్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ''జగనన్న సురక్ష'' కార్యక్రమం సందర్భంగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో వాలంటీర్లు చేస్తున్న ఇంటింటా సర్వే ను రెవెన్యూ డివిజన్‌ అధికారి ఎస్‌. మల్లి బాబు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. వాలంటీర్లు ఇంటింటా సర్వేలో ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు వారికి వివరించి ప్రతి ఒక్కరికి అవి చేరుకుంటున్నాయా లేదా, వారికి ఏమైనా సేవలు అవసరం తదితర అంశాలను తెలుసుకుంటారని అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువ పత్రాలు, వివాహ ధ్రువపత్రములు, పెన్షన్‌ తదిదర సర్వీస్‌ లు అవసరమైతే వారి అభ్యర్థనలు స్వీకరించి టోకెన్‌ నంబర్‌ లు జారీ చేస్తారన్నారు. తదుపరి గ్రామ సభ జరిగే రోజున లబ్ధిదారులకు ధ్రు వపత్రములు ఉచితముగా మంజూరుచేస్తారన్నారు