Feb 07,2023 22:54

విజయం సాధించిన విద్యార్థులతో చైర్మన్‌ తిరుమలరావు తదితరులు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనవరిలో నిర్వహించిన జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటి అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. కె.వివేక్‌వర్థన్‌ 99.99 పర్సంటైల్‌ను సాధించి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. కెజి.ధనశ్రీ 99.91, ఆర్‌.అఖిల్‌ 99.89, ఎల్‌డి.వర్ధన్‌ 99.89, విఎస్‌ఎస్‌.తేజశ్విని 99.89, ఎంసిహెచ్‌.అపరాజిత్‌ 99.86, సిహెచ్‌.సింజని 99.85, సిహెచ్‌.రాజీవ్‌లోచన్‌ 99.85, జివిఎస్‌జిఎన్‌.వర్షిత్‌ 99.83, పి.సునీత 99.83, ఆర్‌.శివప్రాజిత్‌ 99.82 పర్సంటైల్‌ను సాధించారని తెలిపారు. 99.5 పర్సంటైల్‌ పైన 35 మంది, 99 పర్సంటైల్‌ పైన 66 మంది, 98.5 పర్సంటైల్‌ పైన 98 మంది, 98 పర్సంటైల్‌ పైన 129 మంది, 97 పర్సంటైల్‌ పైన 188 మంది, 96 పర్సంటైల్‌ పైన 246 మంది, 95 పర్సంటైల్‌ పైన 288 మంది, 90 పర్సంటైల్‌ పైన 478 మంది సాధించారన్నారు. సుమారు 510 మందికిపైగా విద్యార్థులు ఎన్‌ఐటి, ఐఐఐటిలో సీట్లు సాధించే అవకాశం ఉందన్నారు. అత్యుత్తమ స్కోర్‌లను సాధించిన విద్యార్థులను అకాడమిక్‌ డైరెక్టర్‌ సతీష్‌బాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరిలతో కలిసి ఆయన అభినందించారు.