ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతోం దని కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాల యం నుంచి ''జగనన్న ఆరోగ్య సురక్ష'' పై కలెక్టర్‌లతో సిఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జెసి ఎన్.తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొ న్నారు.వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా అధికారయంత్రాంగంతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సంబందిత సమన్వయ శాఖల అధికారులతో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో విధులు నిర్వహించాడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే ప్రత్యేక వైదక్య నిపుణుల ద్వారా చికిత్స అందించడం, ఉచితంగా మందులు పంపిణీకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఈ నెల 30 వ తేదీ నుంచి 'జగనన్న ఆరోగ్య సురక్ష' శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మండలంలో ప్రతి రోజు ఒక వైఎస్‌ఆర్ విలేజ్ క్లీనిక్‌తోపాటు ప్రతి పట్టణంలోనూ ఒక వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించాలన్నారు. జిల్లాలో మొత్తం 383 'జగనన్న ఆరోగ్య సురక్ష' శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూరల్ ప్రాంతంలో 368 అర్బన్ ప్రాంతంలో 15 జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్వాంపులు నిర్వహిస్తునట్లు చెప్పారు. క్యాంపులు నిర్వహించే ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో అవసరమైన మందులు ముందుగానే సిద్దం చేసుకుని, అవసరమైన మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు వైద్య అధికారులతోపాటు స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా 'జెఎఎస్' మెడికల్ క్యాంపు ఉండి కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఇంటింటి సర్వే సమయంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు, సంక్రమించని, సంక్రమించే వ్యాధులు, మలేరియా, డెంగీ తదితరాలతో బాధపడుతున్న వారిపై దృష్టి పెట్టాలన్నారు. శిశువులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అవసరం మేరకు రోగులకు ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్య చికిత్సలు చేయించేందుకు సిఫార్సు చేయ్యాలన్నారు. ఈ సమీక్షలో డిఎంహెచ్‌ఓ డా. కె.వెంకటేశ్వరరావు, డిసిహెచ్‌ఓ డా.ఎమ్.సనత్ కుమారి, ఆరోగ్యశ్రీ జిల్లా కోర్డినేటర్ డా. పి.ప్రియాంక, డిఎమ్‌ఓ డా. వీర్రాజు, ఐసిడిఎస్. పిడి కె.విజయలక్ష్మి, డిఈఓ ఎస్. అబ్రహం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. ఎ.వినూత్న తదితరులు పాల్గొన్నారు.










