ప్రజాశక్తి - యంత్రాంగం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న జగనన్న ఆరోగ్య సురక ్ష(జెఎఎస్) శిబిరాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో జెఎఎస్ శిబిరాలు జరిగాయి. ఉండ్రా జవరం మండలంలోని కె.సావ రంలో నిర్వహించిన జెఎఎస్ శిబిరంలో 480 మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్.రామ కృష్ణ, నాయకులు ఎన్.వెంకటేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, బి.శ్రీనివాస్, ఎస్.రామకష్ణ, కె.పాండు రంగారావు, ఎంపిడిఒ జివిఎస్‌ఆర్‌కె.రాజు, ఇఒపిఆర్‌డి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఎండి హసన్ జానీ,తదితరులు పాల్గొన్నారు. అలాగే వెలగదుర్రు గ్రామంలో జెఎఎస్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి సిహెచ్‌ఓ ఎం.సుబ్రహ్మణ్యం గ్రామాల్లో వివిధ రోగాలతో ఉన్న వారిని గుర్తించి ఆయా శిబిరాలకు తరలించి వైద్య సేవలను అందించాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని శాటిలైట్ సిటిలో జెఎఎస్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రూరల్ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొని వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ పాలిక శ్రీను, వైసిపి నాయకులు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చాగల్లు స్థానిక సచివాలయం -4 పరిధిలో జెఎఎస్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. అనంతరం రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం భవనాన్ని ఆమె ప్రారంభించారు. సచివాలయం-3 లో గడపగడప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి ఉపాధ్యక్షురాలు పి.శ్రీలక్ష్మి, ఎంపిపి మట్ట వీరస్వామి. సర్పంచ్ వి. మనశ్శాంతి, ఎంపిటిసి సభ్యురాలు వి.విజయ కుమారి, మండల అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. గోకవరం స్థానిక సచివాలయం-3లో సర్పంచ్ కె. శ్రావణి ఆధ్వర్యంలో జెఎఎస్ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 457 మందికి వైద్య సేవలు అందించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహరం స్టాల్‌ను వైసిపి నాయకులు డి.రమేష్, ఎస్.వీరబాబు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు టి.రాంప్రసాద్, ఎన్.నరసయ్య, షేక్ మేరాబి, సిహెచ్.అనిల్ కుమార్, ఇఒపిఆర్‌డి ఎం.రాజేశ్వరరావు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడి, ఆశ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో జెఎఎస్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిపి కె.సీతారాం ప్రసాద్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ తేజశ్రీ, డాక్టర్ ఎఎస్ కృష్ణవేణి, డాక్టర్ ఎన్.జాన్‌మిల్టన్ వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసం వెంకన్న, పిహెచ్‌సి సూపర్‌వైజర్ జి.సత్యేంద్ర కుమార్, కెవి.నాగేశ్వరరావు, రాజా సులోచన, విజయలక్ష్మి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










