Oct 11,2023 23:13

ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలోని పలు మండలాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష(జెఎఎస్‌) క్యాంపులు బుధవారం జరిగాయి. చాగల్లు మండలం లోని దారవరం గ్రామంలో జెఎఎస్‌ శిబిరాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ మద్దుకూరి రవిప్రసాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో ఎంపిడిఒ బి.రాంప్రసాద్‌, తహశీల్దార్‌ రాజ్యలక్ష్మి, ఇఒపిఆర్‌డి ఆర్‌.శ్రవణ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం లోని పాలంగిలో జెఎఎస్‌ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలందించే లక్ష్యంతో జెఎఎస్‌ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఎంఎల్‌ఎ అన్నారు. పలువురు రోగులను పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి నందిగం భాస్కరరామయ్య, ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, పార్టీ నాయకులు కఠారి సిద్ధార్థ రాజు, బొక్కా శ్రీనివాస్‌, ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెరవలి మండలంలో ముక్కామల గ్రామంలో జడ్‌పి ఉన్నత పాఠశాలలో జెఎఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్‌ కేతా త్రిమూ ర్తులు ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ సత్య కృష్ణవేణి, డాక్టర్‌ కె. ఫణీంద్ర, డాక్టర్‌ పి. లక్ష్మణ్‌, డాక్టర్‌ నితీష్‌ వైద్య సేవలం దించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి వేండ్ర శ్రీనివాస్‌, సొసైటీ అధ్యక్షులు ఆర్‌.ఏసు, జి.రామకృష్ణ, పాల్గొన్నారు.