May 18,2023 14:11

ప్రజాశక్తి-కడియం : క్రీడలకు విద్యార్థులు, యువకులు అధికప్రాధాన్యత నివ్వాలని రాష్ట్ర శాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర కోరారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ రకాల క్రీడా సామాగ్రి అందజేస్తుందని, వీటిని ఉపయోగించుకుని విద్యార్థులు, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మండలంలోని దుళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు క్రికెట్ కిట్, వాలీబాల్, ఫుట్ బాల్, షటిల్ కిట్ తదితర క్రీడా వస్తువులను గురువారం విద్యాకమిటీ చైర్మన్ నూలు సోమేశ్వరరావుకు నాగేంద్ర అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ , గ్రామ వైసిపి కన్వీనర్ సన్నపు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.