ప్రజాశక్తి-తాళ్లపూడి విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ చేస్తున్నట్లు డివైఇఒ రామన్న దొర తెలిపారు. మండలంలోని వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే విషయమై ఎంఇఒను విచారణ అధికారిగా వేస్తామన్నారు. ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నాడని స్పందనలో ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఈ విషయంపై విచారణ చేశామని, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు. ఈయన వెంట ఎంఇఒ వివేకానంద ఉన్నారు.










