ప్రజాశక్తి-తాళ్లపూడి మండలంలోని రావూరుపాడు గ్రామస్తులు రహదారి సమస్యపై వినూత్నంగా తమ ఆవేదనను అధికారులకు తెలిపారు. ఊరిలో ఉన్న రహదారిపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటం అంటూ గ్రామంలో శనివారం హెచ్చరికతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ రహదారి విషయంపై గతంలో ఒకసారి గ్రామస్తులు ఎన్నికలను కూడా బహిష్కరించారు. మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపిటిసి హరిబాబు తెలిపారు. రహదారి సమస్యను పరిష్కరించాలనే తప్ప రాజకీయ దురుద్దేశం కాదన్నారు.










