Mar 25,2023 15:05

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన జగనన్న సొంత ఇంటి స్థలంలో లబ్ధిదారులు తప్పనిసరిగా ఇళ్ళు నిర్మించుకోవాలన్నారు ఉండ్రాజవరం  ఎంపీడీవో ఏ శ్రీనివాస్. శనివారం మండల కేంద్రం ఉండ్రాజవరం సినిమా హాల్ లే అవుట్ కాలనీలో ఏర్పాటుచేసిన హౌసింగ్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఎం విక్టర్ బాబు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ప్రభుత్వం అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఇంటి నిర్మాణంలో ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్న తనను సంప్రదించవచ్చని, లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ళు నిర్మించుకొని,  సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు  పాల్గొన్నారు.