ప్రజాశక్తి-నల్లజర్ల : తాళ్లపూడి మండలం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురై గుండె శాస్త్ర చికిత్స అనంతరం తిరిగి ఇంటికి చేరిన సందర్భంగా ఆయన్ను పరామర్శించేందుకు, నల్లజర్ల మండలం అచ్చన్న పాలెం గ్రామంలోని ఆయన బావమరిది, మాజీ సర్పంచ్ బొప్పన సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకున్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఈ సందర్భంగా ఆమె వెంకటేశ్వరరావుతో మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలని తమ సేవలు పార్టీకి మరింత అవసరమని అన్నారు. ఆమె వెంట మండల వైఎస్ఆర్సిపి నాయకులు ఏఎంసీ చైర్మన్ వల్లభ శెట్టి శ్రీనివాస్ పోసిన శ్రీలేఖ. తదితరులు పాల్గొన్నారు.










