ప్రజాశక్తి - ఉండ్రాజవరం : సామాజిక తనిఖీ అవసరాన్ని, నిర్వహణా పద్ధతిని వివరిస్తూ దానిని యాప్ లో నమోదు చేసే విధానం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి పివిఎస్ నాగరాజు తెలిపారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో మండలములోని 40 ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. మాస్టర్ రిసోర్స్ పర్సన్ గా కె.శ్రీనివాసరావు వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని ఏఎమ్ఓ గౌరీ శంకర్, ఎం.ఐ.ఎస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ నరసింహరెడ్డి పరిశీలించారు.










