ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్
ఆశా వర్కర్ల తమ హక్కుల సాధన కోసం మంగళవారం రాజమహేంద్రవరం డిఎంహెచ్‌ఒ కార్యాయలం వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు పని భారాన్ని తగ్గించాలని సంబంధం లేని పనులు చేయించరాదని ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలని అధికారులు, రాజకీయ నాయకులవేధింపులు ఆపాలని నాణ్యమైన సెల్ ఫోన్ 4జీసిమ్ ఇవ్వాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల పనిభారం తగ్గించాలని, సెలవులు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం డిఎంహెచ్‌ఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచే ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నా జిల్లా నలుమూలల నుండి వందల మంది ఆశా కార్యకర్తలు కార్యాలయం చేరుకొని వర్షాన్ని కూడా లెక్కచెయ్యకుండా తమ డిమాండ్లతో హోరెత్తించడంతో కార్యాలయం దద్ధరిల్లిపోయింది. మధ్యలో డిఎంహెచ్‌ఒ వెంకటేశ్వరరావు వచ్చి నాయకులు చెప్పే సమస్యలు విని పరిష్కారం కోసం కషి చేస్తానని వినతి పత్రాన్ని. స్వీకరించారు. ధర్నా సందర్భంగా జరిగిన సభకు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.అన్నా మణి అధ్యక్షత వహించారు. అన్నా మణి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి. వచ్చిన తర్వాత పని భారాన్ని పెంచుతోందని రూ.10వేలు ఇస్తున్నామని 24గంటలు పని చేయిస్తున్నారని విమర్శించారు సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్.మూర్తి, కెవిపిఎస్ నాయకులు జువ్వల రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి రాజులోవ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజా, అంగన్‌వా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి బేబీ రాణి మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట లక్ష్మి నాగమణి, ధన లక్ష్మి, హైమావతి, మేరీ హవీలా, రాజకుమారి త్యాగలక్ష్మి, దుర్గా హేమ లత జ్యోతి నాయకత్వం వహించారు.










