Jun 08,2023 16:28

ప్రజాశక్తి-గోకవరం(తూగో) : గోకవరం ఎంపీడీవోగా కె పద్మజ్యోతి పదోన్నతిపై గురువారం ఉద్యోగ బాధ్యత స్వీకరించారు పద్మజ్యోతి ముమ్మిడివరంలో ఈవోపీఆర్డిగా పనిచేస్తూ పదోన్నతి బదిలీపై గోకవరం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలు మండల అధికారులు మండల పంచాయతీ కార్యదర్శిలు పుష్ప గుచం ఇచ్చి మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మజ్యోతి మాట్లాడుతూ మండలంలోని ప్రధానంగా జగనన్న కాలనీ నిర్మాణాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. మండలంలో వెల్ నెస్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలు అదనపు గదుల నిర్మాణాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.