Aug 10,2023 23:16

రాజమహేంద్రవరం యుటిఎఫ్‌ హోం వద్ద ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నాయకులు, సభ్యులు

ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో యుటిఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యాలయాల వద్ద యుటిఎఫ్‌ పతాకావిష్కరణలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో యుటిఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని యుటిఎఫ్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణకుమారి యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుప తలపెట్టిన 12 గంటల సామూహిక నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.జయకర్‌ మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, జిఒ 117ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్‌ మాట్లాడుతూ జిఒ 117 వల్ల రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగిపోయాయన్నారు. తరగతుల విలీనం, హేతుబద్దీకరణతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తిరోగమనలో పయనిస్తుందని కనుక ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇవిఎస్‌ఆర్‌.ప్రసాద్‌, శ్రీమణి, ఐ.రాజేశ్వరి, సుధారాణి, రమేష్‌బాబు, రవిబాబు, ప్రకాశరావు, నరేష్‌ పాల్గొన్నారు. గోకవరం ఎంపిపి మెయిన్‌ పాఠశాలలో యుటిఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎంతో మంది సీనియర్‌ కార్యకర్తలు త్యాగాలు ఫలితంగా సంఘం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌విఎన్‌.కాశీ, ఎస్‌.కుమార్‌, కె.నాగభూషణం, కె.శ్రీనివాస్‌, త్రిమూర్తులు, అప్పారావు, భాషా పాల్గొన్నారు. ఉండ్రాజవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు కె.వెంకటరత్నం యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పహ అనే అంశాలతో యుటిఎఫ్‌ ఏర్పడిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడటమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఉయుటిఎఫ్‌ ముందుంటుందన్నారు. కరోనా సమయంలో రూ.10 కోట్లతో సేవలందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.లక్ష్మీనారాయణ, ఎస్‌.తాతారెడ్డి, ఎం.వెంకటలక్ష్మి, కె.మాణ ిక్యాలరావు, అజూబా, పద్మజారాణి, ఎస్‌కె.మీరాసాహెబ్‌, హెచ్‌ఎం ఎస్‌.ల్‌వి.ప్రసాద్‌, విఎల్‌.లక్ష్మీఅనసూయి, జి.అనంత లక్ష్మి, సీనియర్‌ కార్యకర్త కె.మాధవి, తదితరులుపాల్గొన్నారు. పెరవలి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నెం-2లో యుటిఎఫ్‌ పతాకాన్ని సీనియర్‌ కార్యకర్త సిహెచ్‌.ఆదినారాయణ ఆవిష్కరించారు అనంతరం జిల్లా కార్యదర్శి వి.వెంకటరమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు డివిఆర్‌ఎస్‌ తారా కృష్ణ రాష్ట్ర కౌన్సిలర్‌ పివి.రాముడు, ట్రెజరర్‌ కె. మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాగల్లు లోని అశోక్‌నగర్‌ ఎంపిపి పాఠశాలలో యుటిఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడారు. పోరాటాలు, విజయాలను వివరించారు. తొలుత యుటిఎఫ్‌ పతకాన్ని ఆవిస్కరించారు. ఈ కార్యక్రమంలో బి.రవికుమార్‌, పిల్లి శ్రీనివాసమూర్తి, జె.రాజశేఖర్‌, టి.నారాయణరావు, ఎస్‌కె.కరీం, జి.శ్రీహరి, పి.రవివర్మ, పివి.నాగేశ్వరావు, ఎంజిఎం.షరీఫ్‌, వై.నాగరాజు, ఎస్‌.రాజేశ్వరావు తదితరులు పాల్గొన్నారు,