నిడదవోలులో క్రైస్తవుల ర్యాలీ
ప్రజాశక్తి - ఉండ్రాజవరం, నిడదవోలు, గోకవరం
మండలంలో క్రైస్తవులకు మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. చివటం జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ దైవ సేవకులు డాక్టర్ రెవరెండ్ తరపట్ల అబ్బులు, లివింగ్ గాడ్ బెరాకా మినిస్త్రిస్ సండే స్కూల్, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, కల్వరి మినిస్ట్రీస్ చిన్నారులు ఈత మట్టలను చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. నిడదవోలులోని ఆర్‌సిఎం చర్చిలో మట్ల ఆదివారం పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఈత మట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండలంలోని రంప ఎర్రంపాలెంలో బెతస్థ ప్రేయర్ హౌమ్‌లో మట్టల ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ జి.మనోహర్ మాట్లాడారు.










