Feb 18,2023 23:56

ప్రజాశక్తి-యంత్రాంగం మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అన్నదానాలు ఏర్పాటు చేశారు. యాత్రిలకు నదీస్నానాలు చేశారు. రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ పలు శివాలయాల్లో పూజలు చేశారు. ఎంపీ తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన, ఎంపీ భరత్‌, మోనా దంపతులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో రామసాయి దీప్‌, కొత్తా బాల మురళి, మింది నాగేంద్ర, డబ్బింగ్‌ రమేష్‌, అన్నపూర్ణ రాజు, పిట్టా రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల రేవులో రుడా చైర్పర్సన్‌ మేడపాటి షర్మిలా రెడ్డి యాత్రికులతో కలిసి గోదావరి స్నానం చేశారు. కొవ్వూరు రూరల్‌లో గోష్పాద క్షేత్రం వద్ద సుమారు 1000 మంది స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అక్షయపాత్ర చారిటబుల్‌ ట్రస్ట్‌, అవంతి పరిశ్రమ యాజమాన్యం, ఇతర స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు పాలు, పులిహోర వంటివి అందజేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కొవ్వూరు ఆర్‌డిఒ మల్లిబాబు దర్శించుకున్నారు. దర్శించుకున్న ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, జెడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఆలయ చైర్మన్‌ దొద్దా సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్‌ బొక్కా శ్రీనివాస్‌, వైసిపి నాయకులు శరత్‌, తహశీల్దార్‌ జి.కనకరాజు, పెరవలి తహశీల్దారు రాజరాజేశ్వరి తదితరులు ఉన్నారు. పెరవలి మండలం తీపర్రులో రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ ఇంటి వద్ద ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసి సుమారు 20 వేల మందికి అన్నదానం చేశారు. తాళ్లపూడి ప్రక్కిలంక భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద 2000 మందికి అల్పాహారం, వెయ్యి మందికి పాలు, మధ్యాహ్నం 4000 మందికి అన్నదానం సాయంత్రం 300 లీటర్ల చల్లని కూల్‌ డ్రింక్స్‌ అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ సొలస కాశీ విశ్వనాథం, కార్యదర్శి గిరిధర్‌ గాంధీ పాల్గొన్నారు. ప్రక్కిలంక ఘాట్‌ వద్ద సొలస శ్రీరామచంద్రమూర్తి కస్తూరి, పువ్వాడ రత్నకుమారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నాలుగు వేల లీటర్ల మజ్జిగ పంపిణీ చేశారు. నిడదవోలు వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరీ సమేత గొలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద పాలు, బిస్కెట్స్‌, లడ్లు, వాటర్‌ పాకెట్స్‌ పంపిణీ చేశారు. కోట శివరామకృష్ణ, చక్కా రవికుమార్‌, గుప్తా, మానేపల్లి వెంకటరమణ, కేదారిశెట్టి రవికుమార్‌, వలివేటి వెంకట సుబ్బారావు, ఆలమూరి రాజశేఖర్‌, కొణిజేటి సురేష్‌, బచ్చు లక్ష్మణరావు, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, గెల్లి సత్యనారయణ, గమిని నాగేశ్వరరావు పాల్గొన్నారు.