May 15,2023 23:58

ఘనంగా కాటన్‌ 220వ జయంతి

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ గోదావరి జిల్లాలకు అన్నదాత సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 220వ జయంతి సందర్భంగా ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కాటన్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కరువు జిల్లాలకు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి 10 లక్ష ల ఎకరాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన గొప్ప దార్శనికుడు కాటన్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్‌.జైకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పాలిక రాజుబాబు, సహాధ్యక్షుడు బి.లక్ష్మణుడు, ఇతర నాయకులు పిఎస్‌.శేషు కుమార్‌, సయ్యద్‌ బాజీ, సతీష్‌ కుమార్‌, శ్రీనివాస రాజు, ఆదిత్య సోమేశ్వర్‌, వాసుదేవి, ఎన్‌. వెంకట్రావు, రామకృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.
రాజానగరం గోదావరి జిల్లాలను సస్యశ్యామలంగా మార్చిన మహనీయుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విసి ఆచార్య కె.పద్మరాజు అన్నారు. నన్నయ యూనివర్సిటీలో కాటన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాటన్‌ కషి ఫలితంగానే గోదావరి జిల్లాలు ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందుతున్నాయన్నారు. గోదావరి వాసులు నేడు సుఖశాంతులతో జీవిస్తున్నారంటే ధవళేశ్వరంపై కాటన్‌ నిర్మించి బ్యారేజయే కారణం అని తెలిపారు. 18 ఏళ్ళకే ఇంజనీర్‌గా పని చేస్తూ విశేష సేవలందించారని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టువదలకుండా బ్యారేజ్‌ నిర్మాణాన్ని చెపట్టారని చెప్పారు. నేటి తరం విద్యార్థులకు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ వంటి మహనీయుని చరిత్రను తెలియజేయాలన్నారు. దీనిలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ మాట్లాడుతూ కాటన్‌ దొరను గోదావరి వాసులు దేవునిలా పూజిస్తారని, ఆయనను స్పూర్తిగా తీసుకొని పట్టుదలతో పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కె.రమణేశ్వరి, ఆచార్య డి.జ్యోతిర్మయి, ఆచార్య వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ వి.పెర్సిస్‌, డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు, డాక్టర్‌ టి.సత్యనారాయణ, డాక్టర్‌ కెవిఎన్‌డి.వరప్రసాద్‌, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ యామినీ జ్యోత్స్న, కీర్తిమరీఠ, డాక్టర్‌ కిషోర్‌ పాల్గొన్నారు.