ప్రజాశక్తి - యంత్రాంగం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. గోకవరం మండలంలోని రంప ఎర్రంపాలెం గ్రామంలో సర్పంచ్ బాదంపూడి హర్షిత ఆధ్వర్యంలో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ పాటి రాంబాబు, ఉపసర్పంచ్ దాకారపు ధర్మరాజు, బాదంపూడి ప్రకాష్, వార్డ్ మెంబర్ తలారి కాటమస్వామి, అంగన్‌వాడీలు, యాని మేటర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కడియం మండలంలోని దుళ్ల గ్రామంలో సర్పంచ్ కొండపల్లి పట్టియ్య అధ్యక్షతన ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, కార్యదర్శి విజయరాజు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఉండ్రాజవరం గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను మండలంలోని పలు గ్రామ సచివాలయాలు, విద్యాసంస్థలు, పలు ప్రయివేట్ ప్రాంతాల్లో జరి గాయి. ఆయా కార్యక్రమాల్లో మండల అధికా రులు, ఉపాధ్యాయులు, విద్యా ర్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం జడ్‌పి ఉన్నత పాఠ శాలలో హెచ్‌ఎం ఎం.విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెండే వెంకటరావు, ఐ.రాంబాబు పాల్గొన్నారు.










