విద్యార్థులతో కనకరాజు
ప్రజాశక్తి- గోకవరం
మండలంలోని కొత్త పల్లిలో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆదర్శ పబ్లిక్ హై స్కూల్లో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ప్రగళ్లపాటి కనకరాజు, సెక్రటరీ నాగమణి హాజరయ్యారు. విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం ప్రతిభను కనబర్చిన విద్యార్థులు బహుమతులు, మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ త్రినాథరావు, హెచ్‌ఎం సత్యనారాయణ, కో-ఆర్డినేటర్ పి.శ్రీనివాస్, కామేష్, డాక్టర్ కిరణ్, ప్రేమ్, సంకీర్తన, మౌనిక, పద్మ హేమలత పాల్గొన్నారు.










