Mar 26,2023 23:20

ప్రజాశక్తి - తాళ్లపూడి, నిడదవోలు, సీతానగరం
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు పుట్టిన రోజును తాళ్లపూడిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు పంపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దిపాటి ప్రకాశం, చిట్టిబాబు, కొటారు వెంకట్రావు, కాకర్ల వంశీ, కైగాల శ్రీను, గుండుబోగుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అన్నదేవరపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ బిసిలకు రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది టిడిపి పాలనలోనే అన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సత్యేంద్ర, కె.గణేష్‌, టి.భరత్‌ ఎల్‌.ఆదిత్య తదితరులు ఉన్నారు. నిడదవోలు మండలం పెండ్యాలలో కుందుల శిబిరలో టిడిపి శ్రేణులు కేక్‌ కట్‌ చేసి అచ్చెన్నాయుడు పుట్టినరోజును నిర్వహించారు. తెలుగు యువత మాజీ అధ్యక్షులు ఎస్‌కె.బాబు, పెరవలి మండల టిడిపి నాయకులు అనపర్తి జయ, సమిశ్ర గూడెం టిడిపి గ్రామ అధ్యక్షుడు మద్దుకూరి శ్రీనివాస్‌, గుడ్ల బుజ్జి, సుంకవల్లి శ్రీధర్‌, కె.లీలాకుమార్‌, కుందుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ టిడిపి నాయకులు కుందుల వీరవెంకటసత్యనారాయణ హైదరాబాద్‌లో ఉన్న అచ్చెన్నాయుడుని కలిసి బుకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీతానగరం బాలాజీ సెంటర్‌లో మాజీ ఎంఎల్‌ఎ పెందుర్తి వెంకటేష్‌ ఆధ్వర్యంలో అచ్నెన్నాయుడు పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. బాలాజీ సెంటర్‌లో ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేసి పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గద్దే సురేష్‌, చిట్టూరి రంగారావు, వలవల రాజా, తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.