May 27,2023 23:33

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విసిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కె.పద్మరాజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయాల కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌ కార్యాలయంలో నజీర్‌కు పుష్పగుచ్చం అందించి నన్నయ విసిగా నియమించినందుకు కతజ్ఞతలు తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివద్ధికి కషి చేస్తానని, విశ్వవిద్యాలయ అభివద్ధి ప్రణాళికను గవర్నర్‌కు వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విసి ఆచార్య కె.పద్మరాజుకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శుభాకాంక్షలను తెలిపారు.