ప్రజాశక్తి-రాజమహేంద్రవరంరూరల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ''జగనన్న అణిముత్యాల కార్యక్రమము మంగళవారం రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలు నందు సిఎం జగన్ అధ్యక్షతన నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సిఇసిలో 1000 మార్కులకు గాను 968 మార్కులు విద్యార్థిని మాగాపూ.అనూష సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా జగనన్న అని ముత్యాలు కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని అనూషకు ముఖ్యమంత్రి చేతుల మీద రూ.1 లక్ష నగదు బహుమతి, గోల్డ్ మెడల్ మరియు ప్రశంసా పత్రం అందుకుంది.. అవార్డు సాధించిన విద్యార్థినితో పాటు కళాశాల ప్రిన్సిపల్ ఎంఎస్‌విఎల్.నరసింహం తదితరులు అభినందిచారు.










