May 01,2023 23:48

ప్రజాశక్తి - ఉండ్రాజవరం పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘ నిధులు మంజూరు కోరుతూ ఎపి సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాడిపర్రు సర్పంచ్‌ కరుటూరి నరేంద్రబాబు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ మాధవీలతకు వినతిపత్రం అందజేసినట్టు నరేంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో అభివద్ధి పనులు చేపట్టటానికి సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని, సర్పంచులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపినట్టు చెప్పారు. కె.సావరం సర్పంచ్‌ నార్ని రామకృష్ణ పాల్గొన్నారు.