ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లేవారు, ద్విచక్ర వాహనదారులను తరుముతున్నాయి. భయంతో వీటి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. మరికొందరు కుక్కకాటుకు గురవుతున్నారు. కార్పొరేషన్‌లోనే 52 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌లో సుమారు 80 నుంచి 100 కుక్కల వరకు ఉంటాయని అంచనాగా తెలుస్తోంది. ఈ లెక్కన నగరంలోనే 5 వేల కుక్కల వరకు ఉంటాయి. కుక్కకాటు కారణంగా ప్రత్యక్షంగా గాయపడిన వారు కొందరైతే, కుక్కలు తరమడంతో అదుపు తప్పి బైక్‌పై నుంచి క్షతగాత్రులుగా మిగిలిన వారు కొందరున్నారు. ఇటీవల హైద్రాబాద్‌లో రోడ్డు దాటుతున్న బాలుడిని కుక్కలు చుట్టుముట్టి పగబట్టినట్లుగా కొరికి చంపేసిన విషయం విధితమే. అటువంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
కుక్కల నియంత్రణకు చర్యలు ఏవి
పల్లె, పట్టణం తేడా లేకుండా జిల్లాలోనూ కుక్కలు గుంపులుగా వెంటపడుతున్నాయి. గతంలో వీధి కుక్కల నియంత్రణకు నగర కార్పొరేషన్‌లు ప్రత్యేక చర్యలు చేపట్టేవి. కుని ఆపరేషన్ల ద్వారా కొంత మేర కట్టడి చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడా కన్పించడం లేదు. దీంతో పనులకు వెళ్లిన రాత్రివేళ ఇంటికి రావాలన్నా, తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి. రాత్రివేళల్లో వీధిలైట్ల కింద, కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లవద్ద గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. అటుగా వచ్చేవారిని చూసి అరుస్తూ వెంటపడుతున్నాయి. చికెన్, మటన్‌షాపుల వద్ద వ్యర్థాలను తింటూ అక్కడే పడుంటాయి. రోడ్లపై వాహనాల్లో వెళ్ళేవారిని వెంబడిస్తున్నాయి. ఇక, గ్రామాల్లో కుక్కకాటుకు గొర్రెలు, మేకలు, కోళ్లూ బలవుతున్నాయి.
అనర్థం జరిగితే కానీ పట్టించుకోరా?
నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ వెటర్నరీ డాక్టర్ ఉండాలి. వీధి కుక్కలకు సిజేరియన్లు చేయాలి. జిల్లాలో ఏ మున్సిపాలిటీలోనూ వెటర్నరీ డాక్టర్లు లేరు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆస్పత్రి నుంచి వ్యాన్‌ను రప్పించి కుక్కలను పట్టి సిజేరియన్ చేసేవారు. ఏడాదికిగాపై ఒక్క కుక్కకు కూడా సిజేరియన్ చేయలేదని సమా చారం. ఇప్పటి కౖనా అధి కారులు వీది కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.










