Jul 24,2023 23:25

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ నిరంతరం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న దష్ట్యా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు చేరే అవకాశం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం క్షేత్ర స్థాయి అధికారులతో వరద పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు రోజులుగా 9 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిందన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్‌, పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. క్షేత్ర స్థాయిలో తహశీల్దార్‌, ఎంపిడిఒలు ఇతర సమన్వయ శాఖలతో ఎప్పటి కప్పుడు సంప్రదించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న, తెగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి భద్రత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రేపు సాయంత్రం నాటికి 10 లక్షల క్యూసెక్కుల చేరే అవకాశం ఉందని, పై ప్రాంతాల్లో వర్షాలు కురవకపోతే ఎటువంటి ఇబ్బందులూ ఉండవని అధికారులు తెలియ చేశారన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.