ప్రజాశక్తి-పెరవలి మండలంలోని ముక్కామల గ్రామంలో అరటి తోటలు శనివారం సాయంత్రం ఈదురు గాలులు, జోరువానకు విరగిపోయాయి. సుమారు 150 ఎకరాల్లో గెలలు వేసినవి, గెలలు వేయటానికి సిద్ధంగా ఉన్నవి మొక్క తోటలు చాలామేరకు దెబ్బ తిన్నాయి. సన్న చిన్న కారు, కౌలు రైతులు అరటి పంటలు పూర్తిగా నష్టం పోయారు. కౌలు రైతు బొబ్బిలి సత్తియ్యకు చెందిన నాలుగు ఎకరాల 90 సెంట్ల అరటి తోట ఈదురు గాలికి విరిగిపోయింది. అధికారులు పంట నష్టం అంచనా వేసి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.










